దత్తాత్రయ కాలనీ ఫేస్ 2 సమస్యలపై పాదయాత్ర చేసిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

TEJA NEWS

దత్తాత్రయ కాలనీ ఫేస్ 2 సమస్యలపై పాదయాత్ర చేసిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

124 అల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని దత్తాత్రయ కాలనీ ఫేస్ 2 లో పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనుల పై డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ గారు జి.ఎచ్.ఎమ్.సి అధికారులు మరియు కాలనీ వాసులతో కలిసి పాదయాత్ర చేసి సమస్యలను పరిశీలించడం జరిగింది.

ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ దత్తాత్రయ కాలనీ ఫేస్ 2 లో కొంతమేర డ్రైనేజీ మరియు సీసీ రోడ్లకు సంబందించిన పెండింగ్ వర్క్స్ ఉన్నాయని, వాటిని శేరిలింగంపల్లి శాసనసభ్యులు పి.ఎ.సి చైర్మన్ అరేకపూడి గాంధీ దృష్టికి మరియు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి శాంక్షన్ చేయించి అతి త్వరలో నిర్మాణ పనులు మొదలుపెడతామని హామీ ఇచ్చారు. కాలనీలోని కొన్ని గల్లీలలో డ్రైనేజీ లైన్ చిన్నగా ఉండి నిత్యం పొంగుతూ డ్రైనేజీ నీరు రోడ్లపైన ప్రవాహస్తూ ఇబ్బందిగా ఉందని కాలనీ వాసులు కార్పొరేటర్ కి తెలియచేయగా కార్పొరేటర్ సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య ఎక్కువగా ఉన్నచోట్లా వెంటనే పెద్ద డ్రైనేజీ లైన్ నిర్మాణం కొరకు ఎస్టిమేషన్ వేసి ఇవ్వాలని తెలిపారు. డ్రైనేజీ మ్యాన్ హోల్ లోపల ప్లాస్టిగ్ లేక నిరంతరం పుడుకుపోయి జామ్ అవుతున్న సమస్యను కాలనీ వాసులు కార్పొరేటర్ దృష్టికి తీసుకువచ్చారు. కార్పొరేటర్ వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి వీలైనంత త్వరగా మ్యాన్ హోల్స్ అన్నింటికీ లోపలవైపు సిమెంట్ ప్లాస్టింగ్ చేసి సమస్యను పరిష్కరించాలని తెలిపారు.

కార్యక్రమంలో శివరాజ్ గౌడ్, గోపాల్, వెంకటేష్, భాస్కర్, పెంటయ్య, లక్ష్మీనారాయణ, అశోక్, శ్రీనివాస్, శ్రీధర్, వేణు, మోహినూద్దీన్, భారత్, లింగం, సుధాకర్, సత్తయ్య, రమేష్, రవీందర్.

జి.ఎచ్.ఎమ్.సి అధికారులు ఎస్.ఆర్.పి నాగేశ్వర నాయక్, వర్క్ ఇన్స్పెక్టర్ రవి కుమార్, UBD నాగరాణి, ఎంటమాలజీ సూపర్వైజర్ డి.నరసింహులు, వాటర్ వర్క్స్ మేనేజర్ శ్రీనివాస్, వాటర్ వర్క్స్ సూపర్వైజర్ శివ, ఎస్.ఎఫ్.ఎ వెంకటరెడ్డి & మల్లేష్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top