“కాంగ్రెస్ బాకీ కార్డు”తో కాంగ్రెస్ మోసాలను ఎండగడుదాం
బీఆర్ఎస్ సీపీఎం అభ్యర్థులను గెలిపిస్తే ప్రజలు తరుపున పోరాడి హామీలు నెరవేర్చేలా చేస్తామని అన్నారు.
వైరా మున్సిపాలిటీలో ఎన్నికల నామినేషన్ ప్రక్రియ సందర్భంలో కాంగ్రెస్ బాకీ కార్డులు పంపిణీ చేసిన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ , ఎమ్మెల్సీ తాత మధుసూదన్ , మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు
వారి వెంట వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు పాల్గొన్నారు
ఎన్నికలకు ముందు ఆరు గ్యారంటీలు, 420 హామీలని ఇచ్చి అధికారంలోకి వచ్చి తెలంగాణ ప్రజానీకాన్ని మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని “కాంగ్రెస్ బాకీ కార్డు”తో ఇంటింటికీ ప్రచారం చేసి ప్రజలకు గుర్తు చేసి రాబోయే స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుదామని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ , ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మరియు సీపీఎం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
