సాయి మందిరంలో ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమం.

TEJA NEWS

సాయి మందిరంలో ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమం..


కోదాడ మండలం నల్లబండగూడెం గ్రామం సాయి మందిరంలో మంగల్ తండా గ్రామానికి చెందిన బానోతు ముని–నిర్మలా దంపతులు దేవాలయ చైర్మన్ నల్లపా నరసింహారావు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం దాతల సహకారంతో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ అన్నదాన కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా దేవాలయ చైర్మన్ నల్లపాటి నరసింహారావు మాట్లాడుతూ, సాయి మందిరంలో ప్రతి గురువారం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. అన్నదాన కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలకు ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో అర్చకులు సాయి శర్మతో పాటు ఇతరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top