చదువు.. గేమ్‌ఛేంజర్: సీఎం చంద్రబాబు
- గుంటూరు: మనం మాత్రమే కాదు.. సమాజం కూడా బాగుండాలనేది మన సంస్కృతి అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఆర్థిక అసమానతలు తగ్గితేనే సమాజం బాగుంటుందన్నారు. భారత రత్నకు మారుపేరుగా కలాం నిలిచారన్నారు. చదువు అనేది గేమ్ ఛేంజర్ అని, సరైన సమయంలో నిర్ణయాలు తీసుకోవాలని పేర్కొన్నారు. గుంటూరులోని జీజీహెచ్‌లో మాతా శిశు కేంద్రాన్ని సీఎం ప్రారంభించారు. మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థులు రూ.100 కోట్ల విరాళం ఇచ్చి ఈ భవనాన్ని నిర్మించారు.
