పలు దినపత్రికల నూతన సంవత్సర క్యాలెండర్ లను ఆవిష్కరించిన బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్

TEJA NEWS

పలు దినపత్రికల నూతన సంవత్సర క్యాలెండర్ లను ఆవిష్కరించిన బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ …

కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని C2 తెలంగాణ ఛానల్, వాస్తవ తెలంగాణ న్యూస్ దినపత్రిక, విజన్ ఆంధ్ర , నేటితరం తెలుగు దినపత్రిక ల ఆధ్వర్యంలో నూతనంగా రూపొందించిన క్యాలెండర్ లను బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ….. ప్రజా సమస్యల పరిష్కారంలో పత్రికలు ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలుస్తూ, నిత్య నూతన కథనాలతో, ప్రజా సమస్య లే పరిష్కార లక్ష్యంగా C2 తెలంగాణ ఛానల్, వాస్తవ తెలంగాణ , విజన్ ఆంధ్ర, నేటితరం తెలుగు దినపత్రిక పనిచేయటం అభినందనీయమన్నారు. రానున్న రోజులలో C2 తెలంగాణ ఛానల్, మరియు వాస్తవ తెలంగాణ, విజన్ ఆంధ్ర, నేటితరం తెలుగు దినపత్రిక
మరింత అభివృద్ధి చెందాలన్నారు.

ఈ కార్యక్రమంలో C2 ఛానల్ & వాస్తవ తెలంగాణ దినపత్రిక రిపోర్టర్ కట్టా దుర్గా రావు, విజన్ ఆంధ్ర దినపత్రిక రిపోర్టర్ కట్టా నాగబాబు, నేటితరం రిపోర్టర్ లక్ష్మీ శ్రీనివాస్, పలువురు బిఆర్ఎస్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top