మాధవ గూడెంలో ఘనంగా సమ్మక్క సారక్క జాతర.

TEJA NEWS

మాధవ గూడెంలో ఘనంగా సమ్మక్క సారక్క జాతర….అమ్మ వార్లను దర్శనం చేసుకున్న మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్.. *.

చిలుకూరు మండలంలోని మాధవగూడెం గ్రామంలో గత మూడు రోజులుగా జరుగుతున్న సమక్క – సారక్కలమ్మ జాతర ముగిసింది. అమ్మవార్లు గద్దెలెక్కడంతో జాతరను రెండు రోజులుగా ముమ్మరంగా జరుతుంది, జాతర సందర్భంగా భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు I తీర్చుకున్నారు. గద్దెల వద్ద మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాతరలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జాతరలో ఏలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు బందోభస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ధృవకుమార్, ఎంపీవో ముక్కపాటి నరసింహారావు, దేవాలయం ధర్మకర్తలు బుడిగెం వీరభద్రయ్య, దాసరాజు తిరపయ్య, సర్పంచ్ దాసరాజు వీరబాబు, సోమగాని వెంకన్న, ఆదిరెడ్డి, ఆలయ దేవుడమ్మ బుడిగెం రాంబాయి, గ్రామ పెద్దలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top