చిరువ్యాపారస్తులకు వేమురెడ్డి దంపతులు అండా

TEJA NEWS

చిరువ్యాపారస్తులకు వేమురెడ్డి దంపతులు అండా

22 మందికి తోపుడు బండ్లు విపిఆర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో

నెల్లూరు విపిఆర్‌ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 22 మంది చిరు వ్యాపారులకు విపిఆర్‌ నివాసంలో తోపుడు బండ్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతమ్మ మాట్లాడుతూ.. కోవూరు నియోజకవర్గంలో నిరు పేదలు వారి కాళ్లమీద వారు నిలబడాలన్న లక్ష్యంతో తోపుడు బండ్లు అందజేస్తున్నామన్నారు. ఇప్పటివరకు చిరు వ్యాపారులు అద్దెకు బండ్లు తీసుకునేవారని, ఇక నుంచి వారికి అద్దె బాధలు తగ్గుతాయన్నారు. నిరుపేదల స్వయం ఉపాధికి ఇవి ఉపయోగపడతాయని ప్రతి ఒక్కరికి అండగా ఉంటాం.

విపిఆర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా ఇప్పటికే దివ్యాంగుల కోసం 1100 ట్రై సైకిళ్లు అందజేశామని, విపిఆర్‌ నేత్ర ద్వారా ఉదయగిరి నియోజకవర్గంలో ఇప్పటివరకు 18 వేల మందికి ఉచితంగా కంటి పరీక్షలు చేసి 10 వేల మందికి అద్దాలు అందించామన్నారు. త్వరలోనే కోవూరు నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి విపిఆర్ నేత్ర సేవలు అందిస్తామన్నారు. జిల్లాలో 198 విపిఆర్‌ అమృత ధార వాటర్‌ప్లాంట్లు ఏర్పాటు చేశామని, మరిన్ని సేవా కార్యక్రమాలు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. రాజకీయాలతో పని లేకుండా విపిఆర్‌ ఫౌండేషన్‌ పనిచేస్తుందని వివరించారు. మీ అభివృద్ధికి మేము ఎప్పుడూ తోడుగా ఉంటామని తెలిపారు. పై కార్యక్రమంలో పెన్న డెల్టా ఛైర్మన్ రాజగోపాల్ రెడ్డి, పడుగుపాడు ఇంచార్జ్ జెట్టి మదన్ రెడ్డి, కోవూరు సర్పంచ్ ఏకశిరి విజయ, ఇంతా మల్లారెడ్డి, బీద భాస్కర్ రావు, పాలూరు వెంకటేశ్వర్లు, బత్తల రమేష్, సాయి తేజ రెడ్డి, యస్.డి దస్తగిరి, షేక్. జమీర్, వంశీ, బాలకృష్ణ తదితరులు ఉన్నారు.

You cannot copy content of this page

Scroll to Top