కానిస్టేబుల్ కుటుంబానికి రూ.1.10 కోట్ల ఆర్ధికసాయం

TEJA NEWS

కానిస్టేబుల్ కుటుంబానికి రూ.1.10 కోట్ల ఆర్ధికసాయం

తిరుపతి: రోడ్డు ప్రమాదంలో మరణించిన పోలీస్ కానిస్టేబుల్ కుటుంబానికి స్టేట్ బ్యాంక్ పోలీస్ శాలరీ ప్యాకేజీ ద్వారా రూ.1.10 కోట్ల ఆర్ధిక సాయం చెక్కును ఎస్పీ సుబ్బరాయుడు అందజేశారు. అలాగే
అనారోగ్య కారణాలతో మృతి చెందిన హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి ఐఆర్ ఫండ్ నుంచి రూ.1 లక్ష చెక్కును కూడా అందజేశారు. వారి వివరాలు ఇలా……రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పీసీ -2951 ఎన్.అయ్యప్ప కుటుంబానికి ఎస్బీఐ పోలీస్ శాలరీ ప్యాకేజీ ద్వారా మంజూరైన రూ.1,10,00,000/- (కోటి పది లక్షలు) చెక్కును, అలాగే అనారోగ్య కారణాలతో మృతి చెందిన హెడ్ కానిస్టేబుల్ -775 కె. శ్రీనివాసరావు కుటుంబానికి ఇమిడియట్ రిలీఫ్ ఫండ్ నుండి మంజూరైన రూ.1,00,000/- చెక్కును తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఎస్పీ కార్యాలయంలో వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ బాధిత పోలీస్ సిబ్బంది కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియపరుస్తూ పోలీస్ శాఖ ఎల్లప్పుడూ వారి కుటుంబాల అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏవో సురేష్ బాబు, బీ సెక్షన్ వెంకటేష్, స్టేట్ బ్యాంక్ రీజినల్ మేనేజర్ వెంకటేశ్వర రావు, పోలీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సోము పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top