నిరుపేద కుటుంబానికి CMRF సాయం – శ్రవణ్ కుమార్ కుటుంబానికి రూ.2.20 లక్షలు

TEJA NEWS

నిరుపేద కుటుంబానికి CMRF సాయం – శ్రవణ్ కుమార్ కుటుంబానికి రూ.2.20 లక్షలు అందచేసిన ఎమ్మెల్యే కూన రవికుమార్

ఆమదాలవలస శాసనసభ్యులు మరియు రాష్ట్ర పబ్లిక్ అండర్‌టేకింగ్స్ కమిటీ (పియుసి) చైర్మన్ కూన రవికుమార్ కొత్తూరు మండలంలోని నేరడి గ్రామానికి చెందిన శ్రవణ్ కుమార్ కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) విభాగం ద్వారా వైద్య చికిత్స నిమిత్తం మంజూరైన రూ.2,20,000/- చెక్కును కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే అందజేశారు.

ఈ సందర్భంగా కూన రవికుమార్ మాట్లాడుతూ, పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు అనారోగ్య సమయంలో ప్రభుత్వ సహాయ పథకాలు ఎంతో ఉపయోగం గా ఉంటాయని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా తమ వంతు కృషి కొనసాగిస్తామని హామీ ఇచ్చారు.

CMRF సహాయం అందడంతో శ్రవణ్ కుమార్ కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే కి మరియు సీఎం చంద్రబాబు నాయుడు కి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల కష్టసమయాల్లో అండగా నిలవడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

You cannot copy content of this page

Scroll to Top