ఘనంగా భౌరంపేట్ మల్లన్న జాతర… ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన బీఆర్ఎస్ఎల్పీ విప్, MLA కేపీ. వివేకానంద …
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ సర్కిల్ భౌరంపేట్ లో జరుగుతున్న మల్లన్న జాతర లో రెండవ రోజు భాగంగా బీఆర్ఎస్ఎల్పీ విప్, MLA కేపీ. వివేకానంద ముఖ్య అతిధిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం వారు మాట్లాడుతూ, గ్రామీణ సంప్రదాయాలు, జాతరలు ప్రజలను ఏకతాటిపై నిలిపే శక్తిగా పనిచేస్తాయని పేర్కొన్నారు. మల్లన్న స్వామి కృపతో నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో భౌరంపేట్ PACS చైర్మన్ మిద్దెల బాల్ రెడ్డి , భౌరంపేట్ మాజీ కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు, BRS పార్టీ సీనియర్ నాయకులు SV. సురేందర్ రెడ్డి , పోలీస్ గోవింద్ రెడ్డి , ధర్మారెడ్డి , మురళీ యాదవ్ , విష్ణువర్ధన్ రెడ్డి మరియు స్థానిక ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ అధ్యక్షులు పద్మారెడ్డి , ఉపాధ్యక్షులు నాచారం సురేష్ యాదవ్ , చింత మల్లేష్ , ఆలయ కమిటీ సభ్యులు, నాయకులు, గ్రామ పెద్దలు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు
