అబద్ధాల పునాదులపై రాజకీయాలు చేస్తున్న మాజీ ఎమ్మెల్యే

TEJA NEWS

అబద్ధాల పునాదులపై రాజకీయాలు చేస్తున్న మాజీ ఎమ్మెల్యేకు, బీజేపీ, బిఆర్ఎస్ నాయకులకు వర్ధన్నపేట ప్రజలే గుణపాఠం చెప్తారన్నా ఎమ్మెల్యే నాగరాజు ..

వర్ధన్నపేట టౌన్ లోని మున్సిపల్ ఎన్నికల కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన 12మంది వార్డు సభ్యులను ప్రకటించిన వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు …

ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ…

అబద్ధాల పునాదులపై రాజకీయాలు చేస్తున్న మాజీ ఎమ్మెల్యేకు వర్ధన్నపేట ప్రజలే గుణపాఠం చెప్తారు..

వర్ధన్నపేట మున్సిపాలిటీ 12వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ప్రజల నుంచి వెల్లువెత్తుతున్న మద్దతును చూసి ప్రత్యర్థులు ఓర్వలేక అసత్యాలు, అవాస్తవాలు, దుష్ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంటింటి ప్రచారంలో ముందుకు దూసుకెళ్తుండగా, ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారు. సంక్షేమం అందిన ఇంటికే ఓటు అడుగుతున్నాం అన్న మా మాటకు ప్రజలు బలమైన మద్దతు ఇస్తున్నారని తెలిపారు.
పదేళ్లు అధికారంలో ఉండి ఒక్క రూపాయి అభివృద్ధి చేయని నాయకులు, ఇప్పుడు “రెండేళ్లలో తట్టెడు మట్టి కూడా పోయలేదు” అని మాట్లాడటం ప్రజల్ని అవమానించినట్టేనని అన్నారు. కళ్లులేని కబోధిలా మాట్లాడడం మానుకుని ఒక్కసారి వర్ధన్నపేటలో అడుగు పెట్టి అభివృద్ధి చూడాలని ఘాటుగా వ్యాఖ్యానించారు..

అంబేద్కర్ చౌరస్తా అభివృద్ధి, రోడ్ల వెడల్పు, డ్రైనేజీలు, రహదారులు చేస్తేనే అభివృద్ధి కాదు మీ పదేళ్ల పాలనలో ఒక్క నిరుపేదకు కూడా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వని మీరు, ఇప్పుడు ప్రశ్నలు అడగడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలోనే మున్సిపాలిటీ పరిధిలోని నిరుపేదలకు 143 ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు…

200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్, 100 పడకల ఆసుపత్రి, మినీ స్టేడియం, మున్సిఫ్ కోర్టు, సబ్ జైలు, బంజారా భవన్ వంటి అభివృద్ధి పనులు మంజూరు చేయించామని స్పష్టం చేశారు. ప్రజల అభిప్రాయం మేరకే వర్ధన్నపేట పట్టణంలోనే 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన జరిగిందని తెలిపారు.
ఒకప్పుడు ఆర్డర్ కూడా లేకుండా వందలాది శిలాఫలకాలు పెట్టిన వారు, ఈరోజు ప్రభుత్వం విధానాలపై మాట్లాడడం హాస్యాస్పదమని అన్నారు. దేవాదాయ భూముల విషయంలో అనుమతులు ఎలా తీసుకోవాలో మాకు తెలుసని, మీడియా సాక్షిగా 100 పడకల ఆసుపత్రి కట్టించి చూపిస్తాం అని స్పష్టంగా ప్రకటించారు.
తండాలను మున్సిపాలిటీలో కలిపి గిరిజనులను ఇబ్బంది పెట్టిన చరిత్ర మీది అని, కాంగ్రెస్ పార్టీ మాత్రం తండాలను గ్రామపంచాయతీలుగా మార్చేందుకు అసెంబ్లీలో పోరాడిందని గుర్తు చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా దీనిపై హామీ ఇచ్చారని తెలిపారు.
కోనారెడ్డిపేట చెరువు ఆక్రమణలపై మాట్లాడే నైతిక హక్కు పదేళ్లు పాలించిన వారికి లేదని అన్నారు. ఇటీవల వర్షాకాలంలో తమ స్వంత నిధులతో ఫీడర్ ఛానల్ మరమ్మత్తులు చేయించి రైతులకు నీళ్లు అందించామని గుర్తు చేశారు.
భూ దందాలు, భూ ఆక్రమణలు తప్ప అభివృద్ధి తెలియని నాయకులు, అభివృద్ధి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని తీవ్రంగా వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న 6 గ్యారంటీలతో బడుగు, బలహీన వర్గాలకు నిజమైన న్యాయం జరుగుతోందని చెప్పారు. మీరు చేసిన అభివృద్ధి చెప్పి ఓట్లు అడగండి – మేము చేసిన అభివృద్ధి, సంక్షేమం చెప్పి ఓట్లు అడుగుతామని సవాల్ విసిరారు.
వర్ధన్నపేట చెరువు కింద ఉన్న రైతులు, పట్టణ ప్రజలు ఈ తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 12 మంది అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించి, వర్ధన్నపేట అభివృద్ధికి బహుమతిగా ఇవ్వాలని పట్టణ ప్రజలను కోరారు…

ఈ సమావేశంలో వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్, మాజీ టెస్కాబ్ ఛైర్మన్ మార్నేని రవీందర్ రావు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు వరద రాజేశ్వర రావు, అధికార ప్రతినిధి నిమ్మాని శేఖర్ రావు, జిల్లా ఉపాధ్యక్షుడు పిన్నింటి అనిల్ రావు, మైనారిటీ నాయకులు మహమ్మద్ చోటే, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు….

You cannot copy content of this page

Scroll to Top