కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు BRS లో చేరిక..
గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మాజీమంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి..
సూర్యాపేట పట్టణంలోని 28 వ వార్డు కు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గులాబీ గూటికి చేరారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని టిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆ వార్డు BRS పార్టీ అభ్యర్థి వల్దాస్ జానీ (J) ఆధ్వర్యంలో రాచకొండ దేవయ్య, మాద ఎర్ర వెంకన్న తో పాటు పలువురు BRS లో చేరగా మాజీమంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి వారికీ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
