ఎన్నికల సిత్రాలు
బిఆర్ఎస్ లో ఏకగ్రీవమై కౌన్సిలర్ విజయలక్ష్మి కాంగ్రెస్ గూటికి చేరింది.
వికారాబాద్ జిల్లా పురపాలికలోని 15వ వార్డు నుంచి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షుడు పి.విజయకుమార్ సతీమణి విజయలక్ష్మి బిఆర్ఎస్ తరపున నామినేషన్ వేశారు. లోపాయికారి ఒప్పందంలో భాగంగా ఆ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి తన నామినేషన్ను ఉపసంహరించుకోవడంతో ఆమె ఏకగ్రీవమయ్యారు. ఆ కొద్దిసేపటికే భార్యాభర్తలు ఫోన్ స్విచాఫ్ చేసుకొని పార్టీ నాయకులకు అందుబాటులో లేకుండాపోయారు.తర్వాత వారు సాయంత్రం మంత్రి సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరిన విషయం తెలుసుకొని భారాస శ్రేణులు నివ్వెరపోయాయి..
