అభివృద్ధిలోసంక్షేమ పథకాల అమలులో*రాష్ట్రాన్ని అగ్రబాగాన నిలిపింది కె.సి.ఆర్

TEJA NEWS

అభివృద్ధిలో
సంక్షేమ పథకాల అమలులో*రాష్ట్రాన్ని అగ్రబాగాన నిలిపింది కె.సి.ఆర్

పాలన చేతకాక ఎలకల పడ్డ రేవంత్.

బి.ఆర్.ఎస్ హయాములో పెబ్బేరు పట్టణాన్ని అభివృద్ధి

పెబ్బేరు మున్సిపల్ పై మరోసారి గులాబీ జెండా రెపరెపలాడించాలి*………

     మాజీ మంత్రి .
    సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి 

వనపర్తి :
మున్సిపల్ ఎన్నికల సందర్భంగాపెబ్బేరు పట్టణములో పలు “”కార్నర్””మీటింగుల్లో పాల్గొని1,3,4,5,6వార్డుల అభ్యర్థులు కరుణశ్రీ,శంకర్ నాయుడు,పవిత్ర,వడ్డే.అనురాధ,గోపిబాబు తరపున విస్తృతంగా పర్యటించి ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి * మాట్లాడుతూ ఆంధ్రోళ్ల వెకిలి చేష్టలు,అవమానాలు ఎదుర్కొని *కె.సి.ఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి అభివృద్ధిలో అగ్రభాగాన నిలిపారని కొనియాడారు.
సంక్షేమ పథకాలు అమలులో దేశంలోనే చరిత్ర సృష్టించారని రైతు బంధు,రైతు బీమా,కళ్యాణ లక్ష్మీ ,కె.సి.ఆర్ కిట్టు,కంటివెలుగు, బతుకమ్మ చీరలు,ఆసరా పింఛన్లు విద్యార్థులకు విద్యా బరోసా అందించి సంక్షేమంలో ,అభివృద్ధిలో అగ్రభాగాన నిలిపారని అందుకే కె.సి.ఆర్ మరోసారి ముఖ్యమంత్రి కావాలంటే మున్సిపల్ ఎన్నికలలో విజయం నాంది కావాలని పిలుపు నిచ్చారు.


అభివృద్ధిలో దూసుకుపోతున్న రాస్థాన్ని కాంగ్రెస్ పార్టీ మహిళలకు 2500,తులం బంగారం, నిరుద్యోగులకు 2లక్షల ఉద్యోగాలు విద్యార్థులకు విద్యా బరోసా విద్యార్థినులకు స్కూటీలు ధాన్యానికి బోనస్ గ్యాస్ సబ్సిడీ రైతులకు రైతు భరోసా రైతు రుణ మాఫీ రైతు బీమా పెంచి ఇస్తామని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను నట్టేట్టే ముంచారని తీవ్రంగా విమర్శించారు.
పెబ్బేరు పట్టణములో నీతివంతమైన పాలన అందించామని రోడ్ల విస్తరణ,అంతర్గత రోడ్లు,డ్రైనేజీలు,విశాలమైన క్రీడా మైదానం,24గంటల మంచి నీటి సదుపాయం కల్పించాలని మరోసారి సుపరిపాలన కావాలంటే బి.ఆర్.ఎస్ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమములో సమన్వయ కర్తలు లక్ష్మారెడ్డి,కర్రీస్వామి,దిలీప్ రెడ్డి,వనం.రాములు,రాజశేఖర్,వడ్డే .రమేష్ తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top