ప్రజలకు సంక్షేమ పథకాలను దూరం చేసిన రేవంత్ రెడ్డి కి మున్సిపాలిటీ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి……… జిల్లా మీడియా కన్వీనర్ అశోక్ పిలుపు
కారు గుర్తు అభ్యర్థి సింగన మొనీ పద్మను గెలిపించాలని విజ్ఞప్తి
వనపర్తి :
తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను దూరం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని శుక్రవారం ఏడో వార్డులో సింగన మోని పద్మ వెంకట్ స్వామి తరఫున ప్రచారం నిర్వహించిన బిఆర్ఎస్ మీడియా సెల్ జిల్లా కన్వీనర్ నందిమల్ల అశోక్ ముఖ్యమంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు
రాజకీయాలకు అతీతంగా ప్రజలకు అండగా నిలిచిన సింగణమోని.పద్మ వెంకటస్వామి.
ఆధ్యాత్మికత సేవలతో ప్రజలలో గుర్తింపు తెచ్చుకున్న నాయకుడు వెంకటస్వామనీ.
నిరంజన్ రెడ్డి ఆశీర్వాదంతో 7వార్డు అభ్యర్థి పద్మ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు
7వార్డు బి.ఆర్.ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సింగణమోని.పద్మ వెంకటస్వామి తరపున నందిమల్ల అశోక్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ కె.సి.ఆర్ సంక్షేమ పథకాలను రేవంత్ రెడ్డి తుంగలో తొక్కి ప్రజలను మోసం చేశారని మహిళకు 2500,తులం బంగారం నిరుద్యోగులకు 2లక్షల ఉద్యోగాలు విద్యార్థులకు విద్యా బరోసా విద్యార్థినులకు స్కూటీలు ధాన్యానికి బోనస్ గ్యాస్ సబ్సిడీ రైతులకు రైతు భరోసా రైతు రుణ మాఫీ రైతు బీమా,కె.సి.ఆర్ కిట్టు,ఆసరా పింఛన్లు,కంటి వెలుగు వంటి సంక్షేమ పథకాలు ప్రజలకు దూరం చేసిన రేవంత్ రెడ్డి కి మున్సిపల్ ఎన్నికలలో బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు.
24గంటలు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే పద్మ వెంకటస్వామి ని గెలిపించాలని ఆయన అభ్యర్థి తరఫున విజ్ఞప్తి చేశారు . ప్రచారంలో బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు వార్డు ప్రజలు మహిళలు గులాబీ కండువాలు జండాలు ప్లగ్ గాడ్స్ తో పెద్ద ఎత్తున ప్రచార నిర్వహించారు.
