ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పటిష్టమైన భద్రతా చర్యలు…
పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా…
పెద్దపల్లి : మున్సిపల్ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు.
పెద్దపల్లి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పెద్దపల్లి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, శాంతినగర్‌లోని పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో చేపట్టిన భద్రతా ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. అనంతరం ఎస్సైలు, సీఐలు,ఏసీపీలు, డీసీపీతో సమావేశమై ఎన్నికల నిర్వహణపై చర్చించి అవసరమైన ఆదేశాలు,సూచనలు జారీ చేశారు.
ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అత్యంత కీలకమైనవని,ప్రతి ఓటరు ఎలాంటి భయం,ఒత్తిడి లేదా ప్రలోభాలకు లోనుకాకుండా స్వేచ్ఛగా తన ఓటు హక్కును వినియోగించుకునేలా పోలీస్ యంత్రాంగం పూర్తి స్థాయిలో భద్రతా చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు.
ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయాలని, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో కట్టుదిట్టమైన బందోబస్తు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
ప్రజలు శాంతియుత వాతావరణంలో నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పోలీసులు అన్ని విధాలుగా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ బి. రామ్ రెడ్డి, పెద్దపల్లి ఏసీపీ జి.కృష్ణ, పెద్దపల్లి సీఐ ప్రవీణ్ కుమార్,ఎస్సై లక్ష్మణ్ రావు తదితరులు పాల్గొన్నారు.
