మున్సిపల్ ఎన్నికల్లో కవిత జోరు

TEJA NEWS

మున్సిపల్ ఎన్నికల్లో కవిత జోరు

వడ్డేపల్లి మున్సిపల్ జాగృతి సింహం కైవసం

మెజారిటీ కొట్టిన జాగృతి అధ్యక్షురాలు కవిత

హైదరాబాద్ ; తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఎవరు ఊహించని పరిణామం చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మద్దతుదారులు భారీ విజయం సాధించడమే కాకుండా మున్సిపాలిటిని కైవసం చేసుకున్నారు. ఈ అనూహ్య ఫలితాలు జోగులాంబ గద్వాల జిల్లాలోని వడ్డేపల్లి మున్సిపాలిటీ (Vaddepalli Municipality)లో చోటు చేసుకుంది. ఇక్కడ మొత్తం 10 వార్డులు ఉండగా.. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి పోటీ చేసిన కవిత మద్దతుదారులు 8 వార్డులను కైవసం చేసుకున్నారు. అలాగే మిగిలిని రెండు స్థానాల్లో అధికార కాంగ్రెస్ 1, బీఆర్ఎస్ 1 వార్డు గెలుచుకున్నారు. ఈ పరిణామం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారనుంది.

You cannot copy content of this page

Scroll to Top