తిరుపతి జిల్లా పోలీస్ శాఖ.
శ్రీకాళహస్తి దేవాలయం లో శివరాత్రి నాడు శివ స్వామి భక్తుల పై పోలీసు లు లాఠీచార్జీ అని సోషియల్ మీడియాలో వస్తున్న వార్తలను తీవ్రముగా ఖండించిన జిల్లా ఎస్ పి. యల్.సుబ్బరాయుడు ఐ.పి.యస్.,
బ్రహ్మోత్సవాల సందర్భంగా గతంలో నంది వాహనం ఊరేగింపు సమయం లో ఎదురైన అనుభవాలను దృష్టి లో ఉంచుకొని స్వామి వారి వాహనాలను మోయు వారిని ముందుగా గుర్తించి వారికి డ్రెస్ కోడ్ ఇవ్వడం జరింగింది మరియు ఈ విషయాన్ని చాలా సార్లు మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేయడం జరిగింది.
కానీ ఉదయం నంది వాహనం తీసుకొని వస్తున్నప్పుడు కొంత మంది శివ స్వామి మాల దారులు క్రమశిక్షణా రాహిత్యంతో నంది వాహనము ను బలవంతంగా తీసుకోనే ప్రయత్నించగా, వాహనం ఒక వైపు వాలే పరిస్థితి లో, అక్కడ వున్న భక్తులకు ఇబ్బంది కలిగే ప్రమాదం ఉన్నందున, అక్కడ వున్న పోలీస్ వారు సమయస్ఫూర్తితో వ్యవహరించి భక్తులకు ఇబ్బంది లేకుండా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవడం జరిగింది.
జిల్లా పోలీస్ శాఖ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి ఒక్క భక్తునికి తక్కువ సమయంలో దర్శనం చేసుకునే లాగా పటిష్ఠ చర్యలు తీసుకోవడం జరిగింది.
కానీ కొంత మంది వాస్తవ విషయాలను ధ్రువీకరించు కోకుండా, జరిగిన విషయాన్ని వక్రీకరించి భక్తులను మరియు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. వారిపై చట్ట పరమైన చర్య తీసుకోవడం జరుగుతుంది.
