22న టీడీపీ కార్యాలయ పనులకు శంకుస్థాపన
** చిత్తూరు పార్లమెంట్ ఆఫీస్ కు స్థల పరిశీలన
చిత్తూరు: చిత్తూరు పార్లమెంట్ టీడీపీ కార్యాలయం నూతన భవన నిర్మాణానికి ఈనెల 22న శంకుస్థాపన చేసేందుకు టీడీపీ ముఖ్య నేతలు తీర్మానించారు. ఇందుకోసం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో చిత్తూరు పార్లమెంట్ సమావేశం జరిపారు. చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సి.షణ్ముఖ రెడ్డి, వై.సునీల్ చౌదరిల ఆధ్వర్యంలో నేతలు సమావేశమై నూతనంగా నిర్మించు భూమి పూజ కార్యక్రమం విజయవంతం చేయాలని….ఇందులో ఎంపీ, ఎమ్మెల్యే, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్, జడ్పీటీసీ, ఎంపీపీ, మాజీ జెడ్పిటిసి, మాజీ ఎంపీపీ.లు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, నామినేటెడ్ పదవులు పొందిన వారు, జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, మండల అనుబంధ కమిటీ అధ్యక్షులు, స్థాయి పదవులు పొందిన నాయకులు, గ్రామ కమిటీ, క్లస్టర్, యూనిట్ ఇంచార్జ్ లు, బూత్ కమిటీ, ఏరియా కమిటీ నాయకులు,
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు 22వ తేదీ ఉదయం 10 గంటల 26 నిమిషాలకు జరుగు శంకుస్థాపన కార్యక్రమంకు హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. కాగా మంగళవారం శంకుస్థాపన స్థలాన్ని పరిశీలించిన వారిలో జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయ కార్యదర్శి యన్.మోహన్ రాజ్, జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు ధనుంజయ నాయుడు, రవి యాదవ్, మైఖేల్, జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధులు. మునిభాస్కర్ రాజు, శశికర్ బాబు, వెంకటేష్ బాబు, పాలసముద్రం సాంబశివ, పులిచెర్ల మహేష్, కార్యనిర్వాహక కార్యదర్శులు అత్తర్ భాష, వేణుగోపాల్, అమ్ములు, నారాయణ, పూర్ణిమ, చెంగల్ రెడ్డి, కార్యదర్శి. ధరణి ప్రసాద్, రవి, పద్మమ్మ, సుజాత తదితరులు పాల్గొన్నారు.
