చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నర్సారెడ్డి భూపతి రెడ్డి

TEJA NEWS

చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నర్సారెడ్డి భూపతి రెడ్డి .

చత్రపతి శివాజీ యూత్ ఆధ్వర్యంలో కొంపల్లి(పోచమ్మ గడ్డ) లో ఏర్పాటుచేసిన చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతి రెడ్డి .

ఈ సందర్భంగా భూపతి రెడ్డి మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ మహారాజ్ మొఘలులను ఎదిరించి, పశ్చిమ భారతదేశంలో హిందూ స్వరాజ్యాన్ని స్థాపించిన గొప్ప యోధుడు మరియు మరాఠా సామ్రాజ్య నిర్మాతఅని, శివనేరి కోటలో జన్మించిన ఆయన గెరిల్లా యుద్ధతంత్రం, నావికాదళం, మరియు ధైర్యసాహసాలు నేటికీ ఆదర్శనీయమని గుర్తుచేశారు.

ఈ కార్యక్రమంలో కొంపల్లి మున్సిపాలిటీ అధ్యక్షులు బైరి ప్రశాంత్ గౌడ్, మాజీ కౌన్సిలర్ శివకుమార్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షులు సదానందం, మాజీ సర్పంచ్ జిమ్మి దేవేందర్, జిల్లా లేబర్ సెల్ అధ్యక్షులు కందాడి సుదర్శన్ రెడ్డి, సీనియర్ నాయకులు గోపాల్ రెడ్డి, భరత్, చత్రపతి శివాజీ యూత్ సభ్యులు యశ్వంత్ కులకర్ణి, శివ, పూర్ణచందర్, బాలాజీ ప్రకాష్ మరియు భారీ సంఖ్యలో మహిళలు అభిమానులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top