ధైర్యం, దేశభక్తి, పరిపాలనా దక్షతకి ప్రతీక చత్రపతి శివాజీ మహారాజ్ : బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ …
132 – జీడిమెట్ల డివిజన్ శ్రీ రాఘవేంద్ర కాలనీలోని శివాజీ సర్కిల్ వద్ద సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఛత్రపతి శివాజీ 396 జయంతి కార్యక్రమానికి బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరై ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి పూజమలవేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ….ధైర్యం, దేశభక్తి, పరిపాలనా దక్షతకి ప్రతీక చత్రపతి శివాజీ అని, దేశరక్షణ, దేశభక్తికి ఛత్రపతి శివాజీ చూపిన మార్గాన్ని నేటి యువత ఆదర్శవంతంగా తీసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో సంక్షేమ సంఘం అధ్యక్షులు నారాయణ, ప్రధాన కార్యదర్శి ఉమాపతిరావు, ఉపాధ్యక్షులు సతీష్, సభ్యుల కోటేశ్వరరావు, సోలార్ శ్రీనివాస్, ఉపేంద్ర, కృష్ణారెడ్డి, స్థానిక బిఆర్ఎస్ నాయకులు, నాయకురాల్లు తదితరులు పాల్గొన్నారు.
