38వ. డివిజన్ లో ప్రతి ఇంటి సమస్యలకు నేనున్నాను…

TEJA NEWS

38వ. డివిజన్ లో ప్రతి ఇంటి సమస్యలకు నేనున్నాను…..

-కార్పొరేటర్ నెలకంటి…..

పెద్దపల్లి//గోదావరిఖని: 38వ. డివిజన్ లో ఎలక్ట్రిసిటీ, శానిటేషన్, టౌన్ ప్లానింగ్, సివిల్, వాటర్, ట్రాన్స్కో సంబంధిత అధికారులతో డివిజన్ లో పర్యటిస్తూ, ప్రతి ఇంటి నుండి సమస్యలను అడిగి తెలుసుకుని వారికి తక్షణమే పరిష్కారం చేస్తానని 38వ. డివిజన్ కార్పొరేటర్ నెలకంటి రాము హామీ ఇచ్చారు. దీనికి సహకరించిన డివిజన్ కి సంబంధించిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

శాసనసభ్యులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ప్రజాపాలనలో భాగంగా నగర సుందరీకరణలో 38వ.డివిజన్ ని సుందరీకరణ చేసే కార్యక్రమంలో నుంచి కడప గడపకు తిరుగుతూ, సంబంధిత అధికారులు, 38వ. డివిజన్ వార్డ్ ఆఫీసర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా పర్యటించి సమస్యలు తెలుసుకోవడం జరిగింది.

ఈ కార్యక్రమంలో 38వ. డివిజన్ అధ్యక్షులు పంజాల ఆంజనేయులు, కోట రాజు, మాజీ కౌన్సిలర్ కవ్వంపల్లి కనకలక్ష్మి, డివిజన్ మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు కనకలక్ష్మి, రజిత, బొంత వెంకటేష్, బైరాం దిలీప్, పసరికొండ రాంకీ, కోట మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top