రెడ్ క్రాస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీరాములును సన్మానించిన సాహితి కళా వేదిక
వనపర్తి : రెడ్ క్రాస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీరాములు సాహితీ కళావేదిక ఆధ్వర్యంలో పట్టణంలో శాలువాతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా అనంతరం రెడ్ క్రాస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీరాములు మాట్లాడుతూ వనపర్తి రెడ్ క్రాస్ సొసైటీ తక్కువ సభ్యత్వం కలిగి ఉందని సభ్యత్వం పెంచడానికి అందరూ కృషి చేయాలన్నారు సభ్యత్వం పెంచుకొని నూతన కమిటీ ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో సాహితీ కళావేదిక జిల్లా అధ్యక్షులు పల్సర్ గౌడ్ తోపాటు కౌన్సిలర్ ప్రేమ్నాత్ రెడ్డి రెడ్ క్రాస్ సభ్యులు పోచా రవీందర్ రెడ్డి ఆమెద్, రాజేంద్ర వెంకట్ రెడ్డి గంధం నాగరాజు బండారు శ్రీనివాస్ సీఎం ఓ ప్రతాపరెడ్డి నిస్వార్థ సంస్థ అరవింద్ చైత శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
