శంకర్‌పల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు స్టేషనరీ అందజేత

TEJA NEWS

శంకర్‌పల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు స్టేషనరీ అందజేత

శంకర్‌పల్లి: శంకర్‌పల్లి మున్సిపల్ పరిధిలోని గణేష్ నగర్ కాలనీ 11వ వార్డుకు చెందిన వడ్డే మల్లికార్జున్, తండ్రి వడ్డే జంగయ్య ఆరవ వర్ధంతి సందర్భంగా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలోని 90 మంది విద్యార్థిని, విద్యార్థులకు స్టేషనరీ అందజేశారు. అనంతరం వడ్డే మల్లికార్జున్ మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి పాఠశాలకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పరమేష్, కాశీనాథ్, శ్రీనివాస్, మహేష్, రాము, రవి, శ్రీనివాస్, శేఖర్, గోపాల్, శ్రీకాంత్, శివసాయి ఉన్నారు.

You cannot copy content of this page

Scroll to Top