ఏపీ రాష్ట్ర బిజెపి కార్యాలయంలో జనతా వారది కార్యక్రమం

TEJA NEWS

ఏపీ రాష్ట్ర బిజెపి కార్యాలయంలో జనతా వారది కార్యక్రమం శుక్రవారం విజయవంతముగా నిర్వహించారు

ప్రజల నుండి జనతా వారధి కార్యక్రమం పట్ల స్పందన రావడం చాలా బాగుంది. ప్రతి శుక్రవారం విజయవాడ జోన్ లొ ఇస్తున్న ప్రజా సమస్యలు పరిష్కరించబడుతున్నాయి అని రాష్ట్ర ఇంచార్జ్ జనతా వారధి కిలారు దిలీప్ అన్నారు

పల్నాడు జిల్లా నుంచి హాజరైన పల్నాడు జిల్లా జనతా వారిది కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరరావు కో కన్వీనర్ గంజర్ల ఆదిలక్ష్మి తదితరులు పాల్గొని పల్నాడు జిల్లా మరియు ఐదు రాష్ట్రాల్లో జరిగిన 15 వేల కోట్ల రూపాయల అవినీతిని పై ఆదోని ఎమ్మెల్యే పార్థసారధి కి బాధితులతో కలిసి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది వారు వెంటనే పల్నాడు జిల్లా ఎస్పీ తో మాట్లాడటం జరిగింది ఈ విషయంపై రాష్ట్ర హోం మినిస్టర్ అనిత తో కూడా మాట్లాడతానని బాధితుల కు హామీ ఇవ్వడం జరిగింది

చాలామంది వచ్చి తమ సమస్యలు పరిష్కారం అయినందుకు బిజెపి పార్టీకి కృతజ్ఞతలు చెప్పడం జరిగింది. అధికారులకు కూడా చలనం వచ్చింది. బిజెపి నుంచి ఏ సమస్య చెప్పిన తక్షణమే స్పందిస్తున్నారు. బిజెపి నాయకత్వం దృష్టికి వెళ్లే సమస్యలు పట్ల అధికారులు ఆలోచన చేస్తున్నారు బిజెపి తీసుకున్న ఈ నిర్ణయం వలన ప్రజలకు ప్రభుత్వానికి ఒక వారధి లాగా జనతా వారధి కార్యక్రమం జరుగుతుందని అని ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారధి అన్నారు

శుక్రవారం జరిగిన జనతా వారధి కార్యక్రమం లో జోనల్ ఇన్చార్జి మరియు మీడియా రాష్ట్ర ఇంచార్జి కిలారు దిలీప్ ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి పల్నాడు జిల్లా జనతా వారిది కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరరావు పల్నాడు జిల్లా కోకన్వీనర్ గంజర్ల ఆదిలక్ష్మి గుంటూరు జిల్లా జనతా వారిది కన్వీనర్ బాపట్ల జిల్లా జనతా వారి కన్వీనర్ ఒంగోలు జనతా వారిది కన్వీనర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

You cannot copy content of this page

Scroll to Top