ఇందుపూరమ్మ, దేశమ్మ కుంభాభిషేకంలో ప్రశాంతమ్మ

TEJA NEWS

ఇందుపూరమ్మ, దేశమ్మ కుంభాభిషేకంలో ప్రశాంతమ్మ

నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండల కేంద్రంలో వెలసిన శ్రీ ఇందుపూరమ్మ, దేశమ్మ అమ్మవార్ల ఆలయంలో నిర్వహించిన మహా కుంభాభిషేక మహోత్సవంలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. భక్తుల కోలాహలం మధ్య అత్యంత వైభవంగా జరిగిన మహా అమ్మవార్ల కుంభాభిషేక మహోత్సవంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అత్యంత సుందరంగా ఆలయాన్ని నిర్మించిన కమిటీ సభ్యులను ప్రశాంతి రెడ్డి ని ప్రత్యేకంగా అభినందించారు.

ఇంతటి మహత్కార్యాన్ని భుజాన వేసుకుని ఉత్సవాలను వైభవంగా నిర్వహించిన సభ్యులందరిపై అమ్మవారి ఆశీస్సులు నిరంతరం ఉండాలని ఆమె ఆకాంక్షించారు. ఆలయాల నిర్మాణం ఎంత ముఖ్యమో వాటి నిర్వహణ కూడా అంతే ముఖ్యమని ఆమె పేర్కొన్నారు. ఆగమ శాస్త్రం ప్రకారం శాస్త్రోక్తంగా నిత్య కైంకర్యాలు జరిగేలా చూడటం ద్వారానే ఆలయాలకు ఆధ్యాత్మిక శోభ చేకూరుతుందని ఆమె కమిటీకి సూచించారు. ఇందుపూరమ్మ, దేశమ్మ తల్లి దీవెనలతో ఇందుకూరుపేట గ్రామ ప్రజలందరూ పాడిపంటలతో, సుఖశాంతులతో సుభిక్షంగా ఉండాలని ఆమె ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ఇందుకూరుపేట మండల టిడిపి అధ్యక్షులు ఏకొల్లు పవన్ కుమార్ రెడ్డి, రాష్ట ఎం ఎస్ ఎం ఈ డైరెక్టర్ రావెళ్ల నాయుడు, టిడిపి సీనియర్ నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, కోడూరు కమలాకర్ రెడ్డి, నాగార్జున నాయుడు, రాంప్రసాద్ నాయుడు, లేబూరు వెంకటేశ్వర్లు, షేక్ ఇంతియాజ్ మరియు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top