పల్నాడు జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరం

TEJA NEWS

పల్నాడు జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక PGRSకార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా స్వయంగా పాల్గొని, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు.
ప్రజలు తమ సమస్యలను విన్నవించుకోగా, కలెక్టర్ వాటిని ఓపికగా విని సంబంధిత శాఖల అధికారులకు బదిలీ చేశారు. ప్రజల ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని, పౌరులకు సత్వర న్యాయం అందేలా చూడాలని అధికారులను ఆమె ఆదేశించారు. ముఖ్యంగా భూ సమస్యలు, సామాజిక పింఛన్లు మరియు మౌలిక సదుపాయాలకు సంబంధించిన వినతులపై తక్షణమే స్పందించాలని ఆమె స్పష్టం చేశారు.

You cannot copy content of this page

Scroll to Top