పల్నాడు జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్లా కు స్పందన కార్యక్రమం

TEJA NEWS

పల్నాడు జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్లా కు స్పందన కార్యక్రమంలో వినతి పత్రం అందించిన: ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి సుబ్బు మాదిగ

పల్నాడు జిల్లా ముప్పాళ్ళ మండలం ముప్పాళ్ళ గ్రామం యస్సి కాలనీ లో 2018 లో అంగన్వాడి బిల్డింగ్ కు నిధులు మంజూరు అవటం జరిగింది బేస్మెంట్ వరకు వేసి ఆ నిర్మాణాన్ని ఆపివేయడం జరిగింది అప్పటినుండి అధికారుల ఆఫీస్ ల చుట్టూ తిరుగుతూ ఉండటం జరిగింది అందులో భాగంగా ఈరోజు పల్నాడు జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్లా ఐఏఎస్ ని ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో స్పందన కార్యక్రమంలో అర్జీలు ఇవ్వడం జరిగింది వెంటనే స్పందించి సంబంధిత పల్నాడు జిల్లా ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారి వారిని మరియు పంచాయతీరాజ్ జిల్లా అధికారి వారిని పిలిపించి వెంటనే పునర్నిర్మాణం జరిపించాలని ఆర్డర్స్ వేయడం జరిగింది పాల్గొన్నవారు పల్నాడు జిల్లా అధ్యక్షులుగుండాల నగేష్ మాదిగ ,పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కందుల జార్జి మాదిగ ,
నరసరావుపేట మండల ఎంఆర్పిఎస్ అధ్యక్షులు వేశపోగు తిమోతి మాదిగ, పల్నాడు జిల్లా ఎమ్మార్పీఎస్ నియోజకవర్గ అధ్యక్షులు పలుకూరి రామారావు, మాదిగ పలువురు ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు

You cannot copy content of this page

Scroll to Top