ప్రభువు ఆశీస్సులు ప్రజలందరి మీద ఉంటాయి. ప్రత్తిపాటి.

TEJA NEWS

ప్రభువు ఆశీస్సులు ప్రజలందరి మీద ఉంటాయి. ప్రత్తిపాటి.

  • ఎర్రకొండ రహదారి మాత ఉత్సవాలలో పాల్గొన్న మాజీమంత్రి ప్రత్తిపాటి.

యడ్లపాడు మండలం ఎర్రకొండ మీద జరుగుతున్న రహదారి మాత పుణ్యక్షేత్రం ఉత్సవాలలో శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రత్తిపాటిని బ్రదర్ సుభాష్ చంద్రబోస్ ఘనంగా సన్మానించారు. అనంతరం ప్రత్తిపాటి క్రైస్తవ సమాజాన్ని ఉద్దేశించి తన సందేశం వినిపించారు. కూటమి ప్రభుత్వం ఉన్నత కాలం రహదారి మాత పుణ్యక్షేత్రంకు సంబంధించి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించటం జరుగుతుందని ప్రత్తిపాటి తెలిపారు. బ్రదర్ సుభాష్ చంద్రబోస్ తన సందేశంతో ప్రభువు ఆశీస్సులు అందించి మీ అందరి జీవితాలలో ఆరోగ్య, సుఖ సంతోషాలతో శాంతిని నింపడానికి ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. బిషప్ భాగ్యయ్య నేతృత్వంలో జరుగుతున్న రహదారి మాత ఉత్సవాలలో పాల్గొనటం ఎంతో సంతోషంగా ఉందని ప్రత్తిపాటి తెలిపారు.

You cannot copy content of this page

Scroll to Top