ఆరవ వార్డు చిన్న శంకర్పల్లిలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: కౌన్సిలర్ ఉషాకిరణ్ విజయ్
శంకర్పల్లి: శంకర్పల్లి మున్సిపల్ పరిధిలోని వ్యవసాయ మార్కెట్ రోడ్డు నుండి చిన్న శంకర్పల్లికి వెళ్లే రోడ్ గుంతల మయంగా మారింది. రోడ్డు సమస్యను వార్డు ప్రజలు కౌన్సిలర్ దృష్టికి తీసుకెళ్లారు. కౌన్సిలర్ వెంటనే స్పందించి వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారని తన సొంత నిధులతో సిమెంట్ తో రోడ్డుకు మరమ్మతులు చేయించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ వార్డులో మౌలిక సదుపాయల కల్పనకు మొదటి ప్రాధాన్యత ఇస్తానన్నారు. వార్డు ప్రజలు కౌన్సిలర్ కు కృతజ్ఞతలు తెలిపారు.
