మహిళల భద్రతే లక్ష్యంగా ఎల్లప్పుడూ అందుబాటులో షీ టీమ్
పెద్దపల్లి //రామగుండం రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు, షీ టీమ్ ఇంచార్జ్ ఎస్ఐ లావణ్య ఆధ్వర్యంలో పెద్దపెల్లి మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో వార్డ్ మెంబర్లకు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమంలో షీ టీమ్ అవగాహన సదస్సు నిర్వహించారు.
షీ టీమ్ సభ్యురాలు స్నేహలత మహిళల భద్రత, ఆన్లైన్ మోసాలు, యాంటీ డ్రగ్స్ మరియు సైబర్ క్రైమ్స్‌పై అవగాహన కల్పించారు. మహిళల రక్షణ కోసం బస్ స్టాండ్లు, ప్రధాన చౌరస్తాలు, కాలేజీల వద్ద షీ టీమ్ నిరంతరం అందుబాటులో ఉంటుందని తెలిపారు.
వేధింపులకు గురైతే 6303923700 నంబర్‌కు భయపడకుండా ఫోన్ చేయాలని, ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు. ఆన్లైన్ మోసాలకు గురైతే 1930 హెల్ప్‌లైన్‌కు సమాచారం ఇవ్వాలని, అత్యవసర పరిస్థితుల్లో 100 నంబర్‌కు డయల్ చేయాలని సూచించారు. తల్లిదండ్రులు పిల్లలపై పర్యవేక్షణ కలిగి ఉండాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో షీ టీమ్ సభ్యులు మౌనిక, సురేష్, కాపులపల్లి పంచాయతీ కార్యదర్శి అంజత్ పాషా, బ్రాహ్మణపల్లి సర్పంచ్ రోజా రాణి, తురకల మద్దికుంట పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్, వార్డ్ మెంబర్లు పాల్గొన్నారు.
