చిలకలూరిపేటలో జనసేన సభ్యత్వ నమోదు సందడి
ప్రధాత మండలనేని చరణ్ తేజ ఆధ్వర్యంలో ‘సేనా సిద్ధం’
జనసైనికుల కుటుంబ ఆర్థిక భద్రతకు, సేవల గుర్తింపుకు భరోసాగా… ‘జనసేన ఉద్యమి !’
చిలకలూరిపేట:జనసేన పార్టీ బలోపేతమే లక్ష్యంగా, కార్యకర్తల సంక్షేమం మరియు గుర్తింపు కోసం నియోజకవర్గ యువ నాయకులు ప్రదాత మండలనేని చరణ్ తేజ పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 26 నుండి నియోజకవర్గవ్యాప్తంగా “జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు” కార్యక్రమాన్ని భారీ ఎత్తున ప్రారంభించనున్నారు.
మూడు విభాగాల్లో సభ్యత్వాలు
ఉద్యమి, సాధక్, ప్రధాత
పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లే క్రమంలో, సభ్యులను వారి సేవల ఆధారంగా మూడు కీలక విభాగాలుగా విభజించి గుర్తింపు ఇవ్వనున్నారు.పార్టీ భావజాలాన్ని లోతుగా అర్థం చేసుకుని, సిద్ధాంతాలకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో పనిచేసేవారు ఈ విభాగం కింద సభ్యత్వం తీసుకోవచ్చు.పార్టీ పోరాటాలకు బలాన్ని చేకూర్చుతూ, కొత్తవారిని ప్రభావితం చేస్తూ, నవతరంలో ప్రేరణ కలిగించి పార్టీలోకి ఆహ్వానిస్తూ సభ్యత్వాలు చేయించే క్రియాశీలక వ్యక్తులు.పార్టీకి పరోక్షంగా ఆర్థిక, సాంకేతిక లేదా మేధోపరమైన సహకారం అందిస్తూ పార్టీ బలోపేతానికి వెన్నుముకగా నిలిచేవారు.
కుటుంబాలకు ఆర్థిక భద్రత – సేవలకు తగిన గుర్తింపు
ఈ సభ్యత్వ నమోదు కేవలం గుర్తింపు కార్డులకు మాత్రమే పరిమితం కాకుండా, కష్టపడి పనిచేసే జనసైనికుల కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడమే ప్రధాన ఉద్దేశమని చరణ్ తేజ పేర్కొన్నారు. పార్టీ కోసం అహర్నిశలు శ్రమించే ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు.
యువతకు పిలుపు రేపు అనగా ఫిబ్రవరి 26 నుండి ప్రారంభం
నియోజకవర్గంలోని యువత, మార్పును ఆకాంక్షించే ప్రతి ఒక్కరూ ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని జనసేనాని పవణ్ కళ్యాణ్ ఆశయ సాధనలో భాగస్వాములు కావాలని మండలనేని చరణ్ తేజ కోరారు. “సేనా సిద్ధం” అంటూ ప్రతి గ్రామంలోనూ, వార్డులోనూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
