భక్తుల వద్దకే భద్రాది రాములోరి తలంబ్రాలు.

TEJA NEWS

భక్తుల వద్దకే భద్రాది రాములోరి తలంబ్రాలు.

డిపో మేనేజర్ సునీత.

గద్వాల్ :

ఇంటి వద్దకే భద్రాచల సీతారాముల కళ్యాణ తలంబ్రాలు
అందిస్తామని గద్వాల్ డిపో మేనేజర్ సునీత తెలిపారు.
శ్రీ భద్రాచల సీతారామస్వామి కళ్యాణ మహోత్సవంలో ఉపయోగించిన పవిత్ర కళ్యాణ తలంబ్రాలను భక్తులకు ఇంటి వద్దకే అందించేందుకు టీ జీ ఎస్ ఆర్ టి సి లాజిస్టిక్స్ ప్రత్యేక సేవలు అందుబాటులోకి తెచ్చినట్లు గద్వాల డిపో మేనేజర్ సునీత ,మరియు లాజిస్టిక్స్ ATM బద్రి నారాయణ తెలిపారు, భక్తులకు సౌకర్యవంతంగా నమ్మకంగా సేవలు అందించడమే టీ జీ ఎస్ ఆర్ టి సి లక్షమని తెలిపారు, భద్రాచలం వెళ్లలేని భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు, తలంబ్రాలు బుకింగ్ చేసుకోవాలనుకునే వారు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పృధ్వీ రాజ్(9154298609) కు సంప్రదిస్తే బుకింగ్ చేసి రసీదు ఇస్తారని తెలియజేశారు

You cannot copy content of this page

Scroll to Top