పార్టీల భేదాలు లేకుండా అన్ని డివిజన్లో అభివృద్ధి చేద్దాం….

TEJA NEWS

పార్టీల భేదాలు లేకుండా అన్ని డివిజన్లో అభివృద్ధి చేద్దాం….

  • ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్….

పెద్దపల్లి //రామగుండం 1.పాలక పక్షం , ప్రతిపక్షం అనే తేడా లేకుండా అన్ని డివిజన్లలో అందరి సమన్వయంతో అభివృద్ది పనులు చేపట్టడం జరుగుతుందని రామగుండం శాసన సభ్యులు ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ అన్నారు. మేయర్ గా రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయం లోని ఛాంబర్ లో మహంకాళి స్వామి పదవీ భాధ్యతలు స్వీకరించిన సందర్భంగా, నిర్వహించిన కార్యక్రమానికి ఆయన సతీ సమేతంగా హాజరై శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థి నాయకుడిగా , యువజన నాయకుడిగా , కాంగ్రెస్ నాయకుడిగా , కార్పొరేటర్ గా సుదీర్ఘ కాలంగా సేవలందించిన దళిత నాయకుడు మేయర్ గా , కార్మిక నాయకుడు , బి సి నాయకుడు గా ఉన్న సీనియర్ నేత డిప్యూటీ మేయర్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , మంత్రి శ్రీధర్ బాబు ఆశీర్వాదంతో ఎంపికయ్యారని అన్నారు.

బొందల గడ్డగా మారిన రామగుండం నగరాన్ని పునర్నిర్మించాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్న తమ పై ఎంత దుష్ప్రచారం చేసినా సత్యదూరమైన మాటలను ప్రజలు నమ్మకుండా ఇటీవలి ఎన్నికల్లో అద్భుత ఫలితాలు ఇచ్చారని అన్నారు.

త్రాగు నీరు , సాగు నీరు , మౌళిక వసతుల కల్పనకు కోట్లాది రూపాయల నిధులు వెచ్చించి అభివృద్ది చేస్తుండడంతో పాటు , 1 X 800 మెగా వాట్ల థర్మల్ ప్రాజెక్ట్ తదితర పరిశ్రమలతో పారిశ్రామిక ప్రగతి రామగుండం నగరంలో చురుగ్గా సాగుతున్నదని అన్నారు. సామాన్యులకు అందుబాటులో ఉండి నూతన పాలక వర్గo పని చేయాలని సూచించారు.

నూతన మేయర్ తొలి సంతకం….

2.స్వచ్చ రామగుండoగా తీర్చి దిద్దడమే ప్రదాన లక్ష్యమని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి అన్నారు. ఎన్నికైన తరువాత తొలిసారిగా రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలోని మేయర్ ఛాంబర్ లోని పీఠం పై ఆశీనులై గురువారం పదవీ భాద్యతలు స్వీకరించారు .

ఇంటింటికీ ఉచితంగా పంపిణీ చేయడానికి అంచనా వ్యయo రూ 10.00 లక్షలతో చెత్త డబ్బాలు కొనుగోలు చేయడానికై ప్రవేశపెట్టిన ఫైలు పై తొలి సంతకం చేశారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో సానిటేషన్ నిర్వహణలో లోపాలను గుర్తించి ప్రక్షాళన చేయడం చేయడం జరుగుతుందని అన్నారు.

రామగుండం నగరంలో కొంతమంది తమ స్వస్థలం లో జనాభా వివరాలు నమోదు చేసుకుంటుండడంతో ఇక్కడ డేటా లో వారి వివరాలు ఉండడంలేదని, తద్వారా నిధుల మంజూరులో నివసిస్తున్న జన సంఖ్య ప్రాతిపదికన రామగుండం నగరానికి నిధులు దక్కడం లేదని అన్నారు.

ఇక్కడ ఉంటున్న ప్రతి ఒక్కరు జన గణనలో ఇక్కడే నమోదు చేసుకోవాలని అన్నారు. అలాగే 1931 తర్వాత తొలిసారిగా జనాభా లెక్కల్లో భాగంగా కుల గణన కూడా జరుగుతున్న నేపధ్యంలో లెక్కలు సరిగా నమోదు అయ్యేలా పర్యవేక్షిస్తామని,
అలాగే రామగుండం నగరానికి సానుకూలంగా ఉండేలా కొత్త మాస్టర్ ప్లాన్ రూపొందించడం జరుగుతుందని, సమగ్ర మాస్టర్ ప్లాన్ రూపొందించి రాబోయే 20 ఏండ్ల వరకు ఉపయోగపడేలా రూపొందిస్తామని అన్నారు.

అంతేకాకుండా ఇప్పటి వరకు కొనసాగుతున్న 15 వ ఆర్థిక సంఘం గడువు ముగిసి ఏప్రిల్ 1 , 2026 నుండి 16 వ ఆర్థిక సంఘం అమల్లోకి వస్తున్న నేపధ్యంలో రామగుండం నగర పాలక సంస్థ కు ఈ ఐదేళ్లు నిధులు అధికంగా వచ్చేందుకు ఏమి చేయాలో అధ్యయనం చేసి, అందుకు అనుగుణంగా నివేదికలు పంపించడం జరుగుతుందని, సమగ్ర నగరాభివృద్ది కొరకు ఒక డి పి ఆర్ రూపొందిoచి ఎన్ ఎల్ ఎ , మంత్రి వర్యులు , ముఖ్యమంత్రి సహకారంతో నిధులు మంజూరు చేయించి పనులు పూర్తి చేయిస్తామని, తనను ఆశీర్వదించిన వారందరికీ మేయర్ కృతజ్ఞతలు తెలిపారు.

అంతకుముందు కుటుంబ సభ్యులతో కలసి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన అనంతరం మేయర్ తన ఛాంబర్ లో పీఠం పై ఆశీనులయ్యారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు స్వయంగా విచ్చేసి మేయర్ కు శుభాకాంక్షలు తెలిపారు.ఎమ్మెల్యే ఎo.ఎస్.రాజ్ ఠాకూర్, ఆయన సతీమణి మనాలీ రాజ్ ఠాకూర్ , కాంగ్రెస్ నాయకులు దుద్దిళ్ల శ్రీను బాబు , జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష , అదనపు కలెక్టర్ ( స్థానిక సంస్థలు ), రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ జె.అరుణ శ్రీ , వివిధ ప్రభుత్వ సంస్థలు , విభాగాల అధికారులు , సిబ్బంది , డిప్యూటీ మేయర్ పాతపెల్లి ఎల్లయ్య , పలువురు కార్పొరేటర్లు , ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులు , పుర ప్రముఖులు , వివిధ సంఘాల ప్రతినిధులు , ప్రింట్ అండ్ ఎలెక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు , స్వచ్చంద సంఘాల ప్రతినిధులు , వివిధ పార్టీల నాయకులతో పాటు డివిజన్ ప్రజలు తండోప తండలుగా నగర పాలక సంస్థ కార్యాలయానికి తరలివచ్చి మేయర్ కు అభినoదనలు తెలిపారు.

You cannot copy content of this page

Scroll to Top