సూర్యాపేటలో అరైవ్,అలైవ్ అవగాహన కార్యక్రమం
సురక్షిత ప్రయాణమే లక్ష్యం,పోలీసుల సూచనలు
సాక్షిత సూర్యపేట జిల్లా : సూర్యాపేట పట్టణంలో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు ట్రాఫిక్ పోలీసు త్యేక కార్యక్రమం నిర్వహించారు. #అరైవ్_అలైవ్ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంలో భాగంగా కొత్త బస్టాండ్ ప్రాంగణంలో ప్రయాణికులకు భద్రతా సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం మరియు పట్టణ ఎస్ఐ మహేందరనాథ్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ“ప్రతి ప్రయాణికుడు సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకోవడమే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యం” అని తెలిపారు.
పరిమితికి మించి ప్రయాణం ప్రమాదకరం
వాహనాలలో అనుమతించిన పరిమితి కంటే ఎక్కువ మంది ఎక్కడం ప్రమాదాలకు దారితీస్తుందని హెచ్చరించారు. ప్రాణ భద్రత కోసం నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
వాహనాల్లో ఓవర్‌లోడింగ్ చేయవద్దు
బస్సులు, ఆటోలు పూర్తిగా నిండితే మరో వాహనం కోసం వేచి ఉండాలి
ప్రయాణ సమయంలో జాగ్రత్తగా ఉండాలి
డ్రైవర్లు ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలి
ప్రజల సహకారంతోనే ప్రమాదాలను తగ్గించగలమని, ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.“సురక్షిత ప్రయాణం – సంతోషకర గమ్యం” అనే సందేశంతో కార్యక్రమం ముగిసింది.
