పటిష్ట భద్రత నడుమ ఈవీఎం, వీవీప్యాట్ గోదాములు..

TEJA NEWS

పటిష్ట భద్రత నడుమ ఈవీఎం, వీవీప్యాట్ గోదాములు..

  • ఈవీఎం, వీవీప్యాట్ గోదాము వద్ద నిరంతర పర్యవేక్షణ..
  • జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ

ఈవీఎం, వీవీప్యాట్ల గోదాముకు పకడ్బందీ భద్రత కల్పించడం జరిగిన‌ప్పటికి నిరంతర పర్యవేక్షణతో అప్రమత్తంగా ఉండాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అదేశించారు.
ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశాలు, మార్గదర్శకాలకు అనుగుణంగా సాధారణ నెలవారీ తనిఖీలలో భాగంగా రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని ఈవీఎం, వీవీప్యాట్ల గోదామును పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరుతో పాటు అగ్నిమాపక విద్యుత్ పరికరాలను పరిశీలించి అనంతరం పర్యవేక్షణ రిజిస్టర్లో సంతకం చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) మార్గదర్శకాలకు అనుగుణంగా ఈవీఎం, వీవీప్యాట్లను భద్రపరుస్తున్న గోదామును క్షుణ్ణంగా తనిఖీ చేసి ఎప్పటికప్పుడు సమగ్ర నివేదికను అందించడం జరుగుతోందన్నారు. అదేవిధంగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలోనూ మూడు నెలలకు ఒక సారి (త్రైమాసిక) తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గోదాము వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉంటూ సీసీ కెమెరాల పర్యవేక్షణతో గట్టి నిఘా ఉంచాలని కలెక్టర్ లక్ష్మీశ అధికారులకు సూచించారు.


ఈవీఎం, వీవీప్యాట్ల గోదాము తనిఖీలో జిల్లా క‌లెక్ట‌ర్ తో పాటు డిప్యూటీ సీఈవో, ఈవీఎంల నోడ‌ల్ ఆఫీస‌ర్ ఆంజ‌నేయులు, డీఆర్వో ఎం. లక్ష్మీనరసింహం, కందుల పరమేశ్వరరావు (ఆమ్ ఆద్మీ పార్టీ), జె.శ్రీనివాస‌రావు (జనసేన), బి.కృష్ణారెడ్డి (బీజేపీ), సురేష్ సిపిఐ (ఎం), కో-ఆర్డినేషన్ సూపరింటెండెంట్ పి.సలీమ్, డిప్యూటి తహాశీల్దార్ ఎ.ఎస్.ఆర్ గోపాల రెడ్డి తదితరులు ఉన్నారు.
………………………………….
(డిఐపీఆర్వో, ఐ అండ్ పీఆర్, ఎన్టీఆర్ జిల్లాల వారి ద్వారా జారీ)

You cannot copy content of this page

Scroll to Top