ఘనంగా వీరి చలపతి అన్న జన్మదిన వేడుకలు..

TEJA NEWS

ఘనంగా వీరి చలపతి అన్న జన్మదిన వేడుకలు..

శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి ప్రసనన్న, వైసీపీ నేతలు,అభిమానులు..

నెల్లూరు జిల్లా DCMS మాజీ చైర్మన్ వైసీపీ రాష్ట్ర కార్యదర్శి వీరి చలపతిరావు జన్మదిన వేడుకలు నార్త్ రాజుపాలెం విసిఆర్ గెస్ట్ హౌస్ లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తోపాటు పలువురు వైసిపి నాయకులు కార్యకర్తలు వీరు చలపతి అభిమానులు కేకును కట్ చేసి పుష్పగుచ్చాలు అందజేసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. దీంతో నార్త్ రాజుపాలెంలో జన్మదిన వేడుకలతో సందడి వాతావరణం నెలకొంది.వారిని ఆయురా ఆరోగ్యాలతో రానున్న రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు అవరోదించాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కొండ్రెడ్డి రంగారెడ్డి, శివుని నరసింహులు రెడ్డి,రామిరెడ్డి మల్లికార్జున్ రెడ్డి, అత్తిపల్లిఅనూప్ రెడ్డి, నలుబోలు సుబ్బారెడ్డి,చిమట శేషగిరిరావు, మావులూరు శ్రీనివాసరెడ్డి, కలువ బాల శంకర్ రెడ్డి, నవీన్ రెడ్డి, సతీష్ రెడ్డి, షేక్ సాహుల్, ఉదయ భాస్కర్, షేక్ గయాజ్, నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top