తిరుపతి జిల్లా పోలీస్ శాఖ.
- మత్తు మాత్రలు ఇచ్చి బంగారు తాళిబొట్టు చైన్ దొంగతనం చేసిన మహిళ అరెస్ట్.
- జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు ఐపిఎస్., గారి ఆదేశాల మేరకు, శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చిన వృద్ధ మహిళను లక్ష్యంగా చేసుకుని మత్తు మాత్రలు ఇచ్చి బంగారు తాళిబొట్టు చైన్ దొంగతనం చేసిన మహిళను తిరుమల టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు.
- 28-01-2020 న ఉదయం సుమారు 7.30 గంటల సమయంలో తిరుమలలోని శ్రీ బేడి ఆంజనేయస్వామి ఆలయం వద్ద వృద్ధ మహిళ (72 సంవత్సరాలు)ను నమ్మబలికి, ఆమెకు టీలో మత్తు మాత్రలు కలిపి ఇచ్చి స్పృహ కోల్పోయేలా చేసి, ఆమె మెడలో ఉన్న సుమారు 73 గ్రాముల బరువున్న బంగారు తాళిబొట్టు చైన్‌ను అపహరించిన ఘటనపై తిరుమల-1 టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
- జిల్లా ఎస్పీ గారి పర్యవేక్షణలో కేసును విచారించిన పోలీసులు 02-03-2026 న తిరుమల హెచ్‌టి కాంప్లెక్స్ పార్కింగ్ వద్ద నిందితురాలిని అదుపులోకి తీసుకుని విచారించగా, నేరాన్ని ఒప్పుకుంది.
- నిందితురాలి వద్ద నుండి:
- సుమారు 8.4 గ్రాముల బంగారు చైన్, నిద్ర మాత్రలు – 8, ఒక ఇనుప కట్టర్ పరికరం, ఒక చీర మరియు ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.
- నిందితురాలు వల్లి వయస్సు 56, సం” భర్త పేరు: ఎఫ్. బుజ్జిబాబు, జాన్సీ నగర్, గుంటూరు జిల్లా. ప్రస్తుతం ఈస్ట్, తమిళనాడు ప్రాంతంలో తాత్కాలికంగా నివసిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.
- ఈ కేసులో నిందితురాలిపై Indian Penal Code Section 379 తో పాటు Indian Penal Code Section 328 కింద కూడా కేసులు నమోదు చేసి జ్యుడిషియల్ రిమాండ్‌కు తరలించారు.
- భక్తులకు సూచనలు:
- తిరుమలకు దర్శనార్థం వచ్చే భక్తులు అపరిచితులు ఇచ్చే ఆహార పదార్థాలు, పానీయాలు లేదా మందులు ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకరించవద్దని పోలీసులు సూచించారు.
- అనుమానాస్పద వ్యక్తులు గమనించినట్లయితే వెంటనే డయల్ 112 లేదా సమీప పోలీస్ అధికారులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
