గడప దాటలేని దివ్యాంగులకు గమ్యం చూపిన వేమిరెడ్డి దంపతులు
పరుల బాధను తమ బాధగా భావించి, కష్టాల్లో ఉన్న వారికి అండగా నిలవడమే పరమావధిగా నమ్మే వేమిరెడ్డి దంపతులు మరోసారి తమ ఉదారతను చాటుకున్నారు. నడవలేని పాదాలకు విపిఆర్ ఫౌండేషన్ తోడయింది. నెల్లూరు నగరం మాగుంట లేఅవుట్లోని తమ నివాసంలో కావలి, కందుకూరు మరియు కోవూరు నియోజకవర్గాలకు చెందిన 10 మంది దివ్యాంగులకు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి బ్యాటరీ ట్రై సైకిళ్ల పంపిణీ చేశారు. నడవలేక, ఇతరులపై ఆధారపడలేక బతుకు భారమైపోతున్న తరుణంలో తమ మొర ఆలకించి బ్యాటరీ ట్రై సైకిళ్ల అందచేసిన విపిఆర్ ఫౌండేషన్ నిర్వాహకులైన ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కు దివ్యాంగులు కృతజ్ఞతలు తెలియచేశారు. అధికారం అనేది ప్రజలకు సేవ చేయడానికి దక్కిన ఒక అవకాశమని ప్రతి దివ్యాంగుడు ఆత్మవిశ్వాసంతో బతకాలన్నదే తమ ఆకాంక్ష అని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పేర్కొన్నారు. వి.పి.ఆర్ ఫౌండేషన్ ద్వారా భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు కొనసాగుతాయని ఆమె స్పష్టం చేశారు.
