జడ్చర్ల ఆసుపత్రి సూపరింటెండెంట్‌పై వేటు
- జడ్చర్ల ప్రభుత్వాసుపత్రి మార్చురీలో ఓ వ్యక్తి శవాన్ని కుక్క పీక్కుతినడంపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆసుపత్రి సూపరింటెండెంట్ చంద్రకళ, ఆర్‌ఎంవో హరినాథ్, డ్యూటీ డాక్టర్, ఎంఎన్‌వోపై సస్పెన్షన్ వేటు వేసింది. జడ్చర్ల పాత ప్రభుత్వ ఆసుపత్రిని వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్‌కుమార్‌తో పాటు ఉన్నతాధికారులు పరిశీలించారు. ఈ ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు.
