ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసానికి

TEJA NEWS

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసానికి చేరుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ .

పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, ఆర్ డబ్ల్యూఎస్, అటవీ శాఖకి సంబంధించిన అంశాలపై చర్చిస్తున్నారు

•జల్ జీవన్ మిషన్ పనుల పురోగతి, నిధుల వినియోగం, పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని రోడ్ల అభివృద్ధి నిధుల కేటాయింపు, నియోజకవర్గాల వారీగా జరిగిన కేటాయింపులు తదితర అంశాలపై చర్చ

  • ⁠రాష్ట్రవ్యాప్తంగా వివిధ పంచాయతీల్లో చేపట్టిన మ్యాజిక్ డ్రెయిన్ల పనుల గురించి తెలిపి అన్ని పంచాయతీల్లో ఈ తరహా డ్రెయిన్స్ నిర్మించడం ద్వారా పారిశుధ్య నిర్వహణ పకడ్బందీగా అమలు చేయవచ్చని వివరించారు

•నీటిపారుదలశాఖ పరిధిలోని డ్రైనేజ్ ల్లో పూడిక తీత అంశాన్ని ప్రస్తావించిన ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ . వేసవిలో పూడిక తీత పనులు చేపట్టి రైతులు పంటలు వేసేలోపు పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

  • ⁠అటవీ శాఖ చేపట్టిన హనుమాన్ ప్రాజెక్ట్ వివరాలను ముఖ్యమంత్రి కు తెలియజేశారు

•అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలోపై పలు అంశాలపై మాట్లాడుకోవాలని తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో సమావేశం జరుగుతోంది.

You cannot copy content of this page

Scroll to Top