మాజీ సర్పంచ్ నరేందర్‌ను పరామర్శించిన బీఆర్ఎస్ నేత

TEJA NEWS

మాజీ సర్పంచ్ నరేందర్‌ను పరామర్శించిన బీఆర్ఎస్ నేత చిమ్ముల గోవర్ధన్ రెడ్డి

జిన్నారం మండలం మంగంపేట గ్రామ మాజీ సర్పంచ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నరేందర్ ఇటీవల ప్రమాదవశాత్తు భవనం పై నుంచి పడిపోయి గాయపడ్డారు. స్థానిక నేతల ద్వారా సమాచారం తెలుసుకున్న బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, సిజిఆర్ ట్రస్ట్ చైర్మన్ చిమ్ముల గోవర్ధన్ రెడ్డి ఆయనను పరామర్శించారు.

ఈ సందర్భంగా నరేందర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, ఆయనకు ధైర్యం చెప్పారు. పార్టీ నాయకులు, కార్యకర్తల కు బీఆర్ఎస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు.

You cannot copy content of this page

Scroll to Top