విజయవాడ ఇంద్రకీలాద్రిపై కుంభాభిషేక మహోత్సవం

TEJA NEWS

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కుంభాభిషేక మహోత్సవం

మంత్రి నారా లోకేష్ కు ఆహ్వానం

ఉండవల్లి: విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో జరిగే కుంభాభిషేక మహోత్సవంలో పాల్గొనాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కు ఆహ్వానం పలికారు. ఈ మేరకు ఆలయ అధికారులు, ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేష్ ను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ నెల 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు మూడు రోజుల పాటు కుంభాభిషేక మహోత్సవం జరగనుంది. 8వ తేదీన అభిషేకం జరగనుంది. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో వి.కే శీనా నాయక్ తదితరులు పాల్గొన్నారు

You cannot copy content of this page

Scroll to Top