రాజ్యసభ సభ్యులు వేం నరేంద్ర రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్

TEJA NEWS

రాజ్యసభ సభ్యులు వేం నరేంద్ర రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్


తెలంగాణ అసెంబ్లీ, హైదరాబాద్.

​తెలంగాణ రాష్ట్రం నుండి రాజ్యసభ సభ్యుడిగా నూతనంగా ఎన్నికైన వేం నరేంద్ర రెడ్డి ని, సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ మర్యాదపూర్వకంగా కలిశారు.

హైదరాబాద్‌లోని తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్న ప్రత్యేక ఛాంబర్‌లో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా వేం నరేంద్ర రెడ్డి కి రాగమయి తన హృదయపూర్వక అభినందనలు మరియు శుభాకాంక్షలు తెలియజేశారు.

​ ​తెలంగాణ హక్కుల కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంటులో వేం నరేంద్ర రెడ్డి బలమైన గొంతుకను వినిపిస్తారనే ఆశాభావాన్ని ఎమ్మెల్యే వ్యక్తం చేశారు.

You cannot copy content of this page

Scroll to Top