కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలలో మౌలిక వసతులను అభివృద్ధి పరుస్తా

TEJA NEWS

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలలో మౌలిక వసతులను అభివృద్ధి పరుస్తా: బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ….

132 – జీడిమెట్ల డివిజన్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిజాంపేట్ సర్కిల్ భగత్ సింగ్ నగర్ ఐడిపిఎల్ వర్కర్స్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ సభ్యులు బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ని మర్యాదపూర్వకంగా కలసి కాలనీలోని మురుగునీటి ఔట్ లైన్, బీటీ రోడ్డు మరమ్మత్తు పనుల వంటి సమస్యలను విన్నవించారు.

ఈ సందర్భంగా బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ…. గత 12 ఏళ్ల కాలంలో కుత్బుల్లాపూర్ నియోజక వర్గంలోని అన్ని ప్రాంతాలలో కోట్లాది రూపాయల నిధులు వెచ్చించి అభివృద్ధి పరచామని, రానున్న రోజుల్లో కూడా కుత్బుల్లాపూర్ నియోజక వర్గంలోని అన్ని ప్రాంతాలలో మౌలిక వసతులను మరింత అభివృద్ధి పరిచేందుకు కృషి చేస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు టీ. శ్రీనివాస రావు, కోశాధికారి ఎస్విఎన్ వాసు కుమార్, కాలనీ వాసులు ఎస్.మధు, బి.యాదగిరి, కేశవ రావు, రాఘవేంద్ర రావు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top