జిల్లావ్యాప్తంగా ఏకకాలంలో కార్డన్ అండ్ సెర్చ్. నిర్వహించిన పోలీసులు.

TEJA NEWS

తిరుపతి జిల్లా పోలీస్ శాఖ.

  • జిల్లావ్యాప్తంగా ఏకకాలంలో కార్డన్ అండ్ సెర్చ్. నిర్వహించిన పోలీసులు.
  • తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు ఏకకాలంలో కార్డన్ అండ్ సెర్చ్ (Cordon and Search) కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా పరిధిలోని అన్ని సబ్‌డివిజన్‌లలో పోలీసు అధికారులు, సిబ్బంది సమన్వయంతో ఈ తనిఖీలు చేపట్టారు.
  • ఈ సందర్భంగా పోలీసులు అనుమానాస్పద ప్రాంతాలు, నివాస ప్రాంతాలు, అద్దె ఇళ్లను ప్రత్యేకంగా పరిశీలిస్తూ ప్రతి ఇంటిని సోదా చేసి అక్కడ నివసిస్తున్న వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే అద్దెదారులు, వలస కార్మికులు మరియు ఇతరుల వివరాలను నమోదు చేసుకొని అవసరమైన సమాచారాన్ని సేకరించారు.
  • అదేవిధంగా ప్రాంతాల్లో సంచరిస్తున్న వాహనాలను తనిఖీ చేసి సరైన పత్రాలు లేని వాహనాలపై చర్యలు తీసుకున్నారు.
  • వాహనదారులకు రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలని పోలీసులు సూచించారు.
  • ఈ సందర్భంగా ప్రజలకు చట్టాలను గౌరవించడం, అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. అంతేకాకుండా శాంతి భద్రతలను కాపాడడంలో పోలీసులకు సహకరించాలని ప్రజలందరితో ముకుముడిగా ప్రతిజ్ఞ చేయించారు.

You cannot copy content of this page

Scroll to Top