శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి భక్తులందరినీ చల్లంగా చూడాలి: బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్

TEJA NEWS

శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి భక్తులందరినీ చల్లంగా చూడాలి: బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ …

127 – రంగా రెడ్డి నగర్ డివిజన్ ఏపీహెచ్బి కాలనీలోని రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయం 10వ వార్షికోత్సవ కార్యక్రమానికి బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరై రేణుకా ఎల్లమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. రేణుకా ఎల్లమ్మ తల్లి దయ భక్తులందరిపై సంపూర్ణంగా ఉండాలన్నారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలన్నారు.

ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ప్రేమ్ కుమార్, రమణయ్య, శ్రీనివాస్ రెడ్డి, రామచందర్ రావు, జగన్, సాయిబాబా, డివిజన్ అధ్యక్షులు ఎర్వ శంకరయ్య, సీనియర్ నాయకులు ఓంకార్ రెడ్డి, క్రాంతి యాదవ్, ఎర్వ సాయికిరణ్ (బంటి), జల్దా లక్ష్మీనాథ్, శ్రీను, రమ్మీ గౌడ్, అల్లావుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top