ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక 99రోజుల కార్యక్రమం

TEJA NEWS

ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక 99రోజుల కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలలోని అన్ని రకాల సమస్యలను పరిష్కరించాలి…..

అన్ని ప్రభుత్వ పాఠశాలలో టాయిలెట్స్ ఉండాలి, లేని పాఠశాలలకు వెంటనే మంజూరు చేయాలి….

మిషన్ భగీరథ ద్వారా అన్ని పాఠశాలలకు త్రాగు నీటి వసతి కల్పించాలి….

అన్ని విద్యా సంస్థలు, పాఠశాలలో సోలార్ విద్యుత్ అందించేందుకు ప్రాజెక్టు రిపోర్ట్ రూపొందించాలి….

హన్మకొండ జిల్లాను ఫైలెట్ ప్రాజెక్టు గా తీసుకోవాలి….

మహిళలకు, బాలికలకు హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలి….

సాగు నీరు అందక ఒక్క ఎకరం కూడా ఎండిపోవడానికి వీలులేదు….

పంట పొలాలకు సాగు నీరు ఈ నెల రోజులు అత్యంత కీలకం….

హన్మకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశం మందిరంలో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య అధ్యక్షతన ఏర్పాటు దిశా కమిటీ సమావేశానికి మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తో పాటు శాసన మండలి వైస్ చైర్మన్ బండ ప్రకాష్, ఎమ్మెల్సీ బస్వారాజు సారయ్య, ఎమ్మెల్యేలు కేఆర్. నాగరాజు, గండ్ర సత్యనారాయణ రావు, కూడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి, గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పై పాల్గొన్నారు.

ఈ సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ……

ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. ప్రతీ సంవత్సరం పాఠశాలలో ఎన్రోల్మెంట్ మొక్కుబడిగా చేస్తున్నారని, ఈ సంవత్సరం అయినా సీరియస్ గా ఎన్రోల్మెంట్ చేయాలని సూచించారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా అన్ని ప్రభుత్వ విద్యా సంస్థలు, పాఠశాలలో సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించాలని తెలిపారు. జిల్లాలోని అన్ని పాఠశాలలకు సోలార్ విద్యుత్ అందించాలని తెలిపారు. అందుకు సంబందించి హన్మకొండ జిల్లాను ఫైలెట్ ప్రాజెక్టుగా తీసుకొని ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. మిషన్ భగీరథ ద్వారా అన్ని పాఠశాలలకు త్రాగు నీరు అందించాలని అన్నారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహించే దిశా కమిటీ సమావేశానికి కొన్ని శాఖల నుండి జిల్లా స్థాయి అధికారులు హాజరుకాకపోవడం పట్ల అసహనం వ్యక్తం చేశారు.

వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 99రోజుల ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని అన్నారు. అలాగే ఈ 99రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ఎన్నికైన ప్రజా ప్రతినిధులను తప్పనిసరిగా భాగస్వాములను చేయాలని సూచించారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు మరియు అన్ని ప్రభుత్వ పాఠశాలలోని బాలికలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి హెల్త్ ప్రొఫైల్ రూపొందించి హెల్త్ కార్డులు అందించెందుకు మొదటి ప్రాధాన్యత గా తీసుకోవాలని సూచించారు. ఎంజీఎన్ఆర్ఈజిఎస్ పథకం వచ్చిన మార్పులను అధికారులు పరిశీలించాలని అన్నారు. గతంలో కేంద్రం వాట 90శాతం రాష్ట్రం వాట 10శాతంగా ఉండేదని, కాని ఇప్పుడు కేంద్రం వాట 60శాతంగా రాష్ట్రం వాట 40శాతంగా మారిందని అన్నారు. ఈ పథకంలో వచ్చిన మార్పులతో పాటు ఏ విధమైన పనులు చేపట్టవచ్చో వివరాలు తెలిపాలని చెప్పారు.

దేవాదుల కింద దాదాపు 3లక్షల ఎకరాలలో పంట సాగు అవుతుందని ఒక్క ఎకరం కూడా నీరు అందక ఎండిపోవడానికి వీలు లేదని స్పష్టం చేశారు. రిజర్వాయర్లలో నీటి నిలువలను పర్యవేక్షస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. రానున్న ఈ నెల రోజులు అత్యంత కీలకమైన సమయం అని తెలిపారు. కావున ఈ నెల పంపింగ్ లో డిస్ట్రిబ్యూషన్ లో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, దిశా కమిటీ సభ్యులు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top