స్విమ్స్ లో సీఎంఈ విజయవంతం
తిరుపతి: శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్) ఎండోక్రైనాలజీ, బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో శనివారం పద్మావతి ఆడిటోరియంలో నిరంతర వైద్య విద్యా కార్యక్రమాన్ని (సిఎంఇ) విజయవంతంగా నిర్వహించారు. స్విమ్స్ సంచాలకులు డా.ఆర్.వి. కుమార్ మాట్లాడుతూ… ఈ సిఎంఇ ద్వారా
వైద్య విద్యార్థులు వారి నైపుణ్యాలను, మెరుగైన చికిత్స అందించడంలో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. నిరంతర అభ్యాసం ద్వారా వైద్యులు తమ వృత్తిపరమైన అభివృద్ధి కొనసాగించవచ్చని తెలిపారు. డిపార్ట్మెంట్ ఆఫ్ బయో కెమిస్ట్రీ ప్రొఫెసర్ డా.హరిణి దేవి “నవజాత స్క్రీనింగ్ బయోకెమికల్ ఆధారం, ప్రయోగశాల”
అంశాలు అనే అంశం పై మాట్లాడారు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎండోక్రైనాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. ఎల్.వెంకటేష్ “పుట్టుకతో వచ్చే హైపోథైరాయిడిజం కోసం స్క్రీనింగ్” అనే అంశంపై ప్రసంగించారు.
అలాగే ఎండోక్రైనాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. ఆర్. మనోజ్ కుమార్ రెడ్డి పుట్టుకతో వచ్చే అడ్రినల్ హైపర్ప్లాసియా కోసం స్క్రీనింగ్ అనే అంశంపై వివరించారు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మకాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.తులసి గోకుల్ నవజాత శిశువులలో ఫార్మకో కైనటిక్ మార్పులు అనే అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా విశదీకరించారు.
అనంతరం ప్యానల్ చర్చలో “నవజాత శిశువుల స్క్రీనింగ్ మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ అనే అంశంపై డిపార్ట్మెంట్ ఆఫ్ బయో కెమిస్ట్రీ విభాగాధిపతి డా. అపర్ణ ఆర్ బిట్లా మోడరేటర్ గా, ప్యానలిస్టులు గా పిడియాట్రిక్స్ విభాగాధిపతి డా. పునీత్ పాటక్, బయోకెమిస్ట్రీ అసోసియేట్ ప్రొఫెసర్ డా.కుసుమ కుమారి, ఎండోక్రైనాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ డా. గాయత్రి, ఫార్మాకాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ డా. రవీంద్ర కుమార్ పాల్గొన్నారు. చివరగా ఎం.బి.బి.ఎస్ విద్యార్థినులకు క్విజ్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్విమ్స్ డీన్ అండ్ ఎండోక్రైనాలజీ విభాగాధిపతి డా.అలోక్ సచన్, రిజిస్ట్రార్ కమ్ బయోకెమిస్ట్రీ విభాగాధిపతి డా.అపర్ణ ఆర్ బిట్లా, ఫార్మాకాలజీ విభాగాధిపతి డా. ఉమామహేశ్వర రావుతో పాటు ఎండోక్రైనాలజీ, బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ, పిడియాట్రిక్స్ విభాగాల వైద్యులు, సిబ్బంది, ఎం.బి.బి.ఎస్ విద్యార్థులు పాల్గొన్నారు.
