బౌద్ధనగర్ లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ఎం. ఎల్. ఏ, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ ఇఫ్తార్ విందు కార్యక్రమాలు పరమత సహనానికి ప్రతీకలుగా నిలుస్తాయని అన్నారు. ప్రజలు సుఖసంతోషాలతో రంజాన్ వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలూ చిరకాలంగా అన్ని కులాలు, మతాల ప్రజల సహజీవనంగా నిలుస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో, బీ.ఆర్.ఎస్. యువ నేత రామేశ్వర్ గౌడ్, మైనారిటీ నేత మహమ్మద్ రజాక్, స్థానిక మైనారిటీ నేతలు పాల్గొన్నారు.
